ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Dec 4, 2021 3:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇపుడు మళ్ళీ ఓ కీలక షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఇది కూడా రేపటి నుంచే స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై మరింత సమాచారం ఏమిటంటే హైదరాబాద్ లో స్టార్ట్ చేసే ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా పాల్గొననుందట. అయితే ఈ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో 7 ఎకరాల విస్తీర్ణంలో జరగనుందట. మరి ఇందులో ప్రభాస్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రాన్ని వైజయంతి ఇండియా లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :