ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” పై లేటెస్ట్ అప్డేట్

Published on May 17, 2022 4:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈలోగా, నటుడు తన తదుపరి భారీ చిత్రం ప్రాజెక్ట్ కే కోసం కూడా కష్టపడి పని చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఓ వార్తను బయటపెట్టాడు.

ఆయన ట్విట్టర్‌ ద్వారా, ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో కూడిన మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిపారు. ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొణె నటిస్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ విఎఫ్‌ఎక్స్‌ హై ఆన్‌ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :