ప్రభాస్ “సలార్” పై లేటెస్ట్ అప్డేట్

Published on Jun 12, 2022 7:57 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ చిత్రం చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

రిపోర్ట్స్ ప్రకారం, ప్రభాస్ కూడా సెట్స్‌లోకి జాయిన్ అయ్యాడు. ప్రస్తుత షెడ్యూల్ కొన్ని రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో స్టార్ హీరో మరియు ఇతరులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ బిగ్గీలో జగపతి బాబు, పృథ్వీరాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :