అల్లు అర్జున్ “పుష్ప” షూట్‌పై లేటెస్ట్ అప్డేట్?

Published on Oct 19, 2021 3:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. అయితే ‘పుష్ప ది రైజ్’ పేరిట ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి.

అయితే నవంబర్ 5వ తేదిలోపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నా, ఈ సినిమాలోని మరో మూడు పాటలు ఇంకా చిత్రీకరించబడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూడు పాటలలో ఒక పాటను విదేశాల్లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరీ ఇవన్ని పూర్తి చేసుకుని అనుకున్న సమయానికే పుష్పరాజ్ వచ్చి సందడి చేస్తాడా లేదా అనేది అభిమానుల్లో ఒకింత అనుమానాన్ని రేకెత్తిస్తున్న అంశమని చెప్పాలి.

సంబంధిత సమాచారం :