‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ చిత్రం ‘ధర్మన్’ దర్శకుడు అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కనుంది. కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్ డాక్టర్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

తొలుత ఈ ప్రాజెక్ట్‌కి సుందర్ సి, ఆ తర్వాత సిబి చక్రవర్తి దర్శకులుగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, చివరికి ఈ ప్రాజెక్ట్ అశ్విత్ మారిముత్తు చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 11 నుంచి చెన్నైలో ప్రారంభం కానుండగా, స్పీడ్ షెడ్యూల్స్‌లో షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version