ఇంట్రెస్టింగ్ లుక్ లో హీరో రామ్ ?

Published on Feb 28, 2023 8:09 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ ఏభై ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ఈ ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో ఫుల్ రగ్గడ్ అండ్ రఫ్ లుక్ లో రామ్ 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తాడని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట.

అలాగే, ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు. కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :