‘చరణ్’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఐతే, ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో మరో బాలీవుడ్ హీరోని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ ను బుచ్చిబాబు ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఐతే, బాబీ డియోల్ పాత్ర ‘విలన్ పాత్ర’ కాదు అని, చరణ్ పాత్రకు మెంటర్ గా బాబీ డియోల్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా అమితాబ్ పేరు కూడా వినిపిస్తోంది.

Exit mobile version