‘గేమ్ ఛేంజర్‌’ పై లేటెస్ట్ అప్ డేట్

‘గేమ్ ఛేంజర్‌’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Jul 7, 2024 7:00 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. కాగా రామ్ చరణ్ వంతు షూటింగ్‌ నిన్నటితో ముగిసిందని.. ఇక ఇతర నటీనటులపై కొంత షూటింగ్ మిగిలి ఉన్నట్లు టాక్ నడుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు