‘సంజయ్ దత్’ పాత్ర పై క్రేజీ న్యూస్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా సంజయ్ పాత్ర ఉండబోతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందట. పైగా సంజయ్ దత్ పాత్రలో ఫుల్ ఎంటర్ టైయినింగ్ యాంగిల్ కూడా ఉంటుందని టాక్. మొత్తానికి ఎక్స్ పెక్ట్ చేయని లెవల్ లో సంజయ్ దత్ ఉండబోతోందని తెలుస్తోంది.

కాగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Exit mobile version