పూజా హెగ్డేకి మరో స్పెషల్ సాంగ్.. ఒప్పుకుంటుందా?

Published on May 30, 2022 10:00 am IST


స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సందీప్. ఆ సాంగ్ లో పూజా హెగ్డేను తీసుకోవాలని ‘యానిమల్’ టీమ్ ప్లాన్ చేస్తుంది. మరి స్పెషల్ సాంగ్ చేయడానికి పూజా హెగ్డే ఒప్పుకుంటుందో ? లేదో చూడాలి. ఎఫ్ 3లో కూడా పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఈ సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు.

ఇక మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్‌’ సాగనుంది. ఈ సినిమాలో రష్మీక మందన్నా కథానాయికగా నటించబోతుంది. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :