‘యానిమల్’ కోసం రష్మిక స్పెషల్ సాంగ్.. నిజమేనా?

‘యానిమల్’ కోసం రష్మిక స్పెషల్ సాంగ్.. నిజమేనా?

Published on Mar 7, 2022 8:00 PM IST

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. కాగా సందీప్ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సందీప్. ఆ సాంగ్ లో రష్మిక మందన్నాను తీసుకోవాలని ‘యానిమల్’ టీమ్ ప్లాన్ చేస్తుంది.

మరి స్పెషల్ సాంగ్ చేయడానికి రష్మికా మందన్నా ఒప్పుకుంటుందో ? లేదో చూడాలి. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్‌’ సాగనుంది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు.

టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు