‘రంగ‌రంగ వైభ‌వంగా’ నుంచి థ‌ర్డ్ సింగిల్ ప్రోమో !

Published on Jul 31, 2022 8:45 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రాబోతున్న తాజా చిత్రం ‘రంగ‌రంగ వైభ‌వంగా’. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ వెర్ష‌న్ ‘ఆదిత్యవ‌ర్మ’ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ గిరీశ‌య్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో ఫుల్ బిజీగా ఉంది.

అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి థ‌ర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫుల్ లిరిక‌ల్ సాంగ్‌ను ఆగ‌స్టు 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :