వారం గ్యాప్ లోనే రానున్న రష్మిక బాలీవుడ్ చిత్రాలు !

Published on Nov 8, 2021 4:39 pm IST


రష్మిక మండన్నా ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టి రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. వాటిల్లో రష్మిక మొదటి హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా ఉందని మేకర్స్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఈ సినిమా మే 13, 2022న రిలీజ్ కాబోతుంది.

ఇక రష్మిక నటిస్తున్న రెండో హిందీ సినిమా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్ బై’ సినిమా. కాగా ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ కాబోతుందట. ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు గానీ, దాదాపు ‘మిషన్ మజ్ను’ రిలీజ్ అయిన వారం గ్యాప్ లోనే రిలీజ్ అవుతుందట. మొత్తమ్మీద వారం గ్యాప్ లోనే రష్మిక నుంచి రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

సంబంధిత సమాచారం :