మాస్ మహారాజ్ “ధమాకా” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 16, 2022 1:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో సాలిడ్ ఎంటర్టైనర్ గా చేస్తున్న చిత్రం “ధమాకా” కూడా ఒకటి. హిట్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని మాస్ మహారాజ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గా స్పెయిన్ షూట్ నిమిత్తం బయలుదేరింది.

మరి ఇపుడు అక్కడ షెడ్యూల్ ని ఒక ఇంట్రెస్టింగ్ మరియు గ్రాండ్ సాంగ్ తో స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తో తెలియజేసారు. అలాగే ఈ సాంగ్ షూటింగ్ తాలూకా ఆన్ లొకేషన్ ఫొటోస్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి గాను సంగీత దర్శకుడు భీమ్స్ ఇంట్రెస్టింగ్ ట్యూన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :