యూఎస్ లో “RRR” వసూళ్లపై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 27, 2022 5:30 pm IST


టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మరో సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ సాలిడ్ వసూళ్ళని అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ గా నిలిచింది. అయితే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ప్రీమియర్స్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సూపర్ స్ట్రాంగ్ వసూళ్ళని ఈ చిత్రం అందుకున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం ఇప్పటివరకు 7.5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసినట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సరిగమ సినిమాస్ వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనితో ఈరోజు కంప్లీట్ అయ్యే సరికి సునాయాసంగా ఒక్క యూఎస్ లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా అందుకుంటుంది అని చెప్పాలి. అలాగే ఇంకో పక్క అంతా లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో అనేది కూడా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :