“RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ పై లేటెస్ట్ సమాచారం.!

“RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ పై లేటెస్ట్ సమాచారం.!

Published on Mar 12, 2022 9:15 PM IST


ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ని వేరే లెవెల్లోకి తీసుకెళ్లడానికి గాని ఇప్పటికే రాజమౌళి అండ్ కో ఎన్నో ప్రమోషన్స్ మరియు ఈవెంట్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వీటిలో అంతా ఒకింత శక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదన్నా ఉంది అంటే అది దుబాయ్ లో ప్లాన్ చేసిన భారీ ఈవెంట్ అని చెప్పాలి. అయితే ఈ ఈవెంట్ పై ఇప్పుడు లేటెస్ట్ సమాచారం తెలుస్తుంది. ఈ ఈవెంట్ ని అక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర జరపనుండగా ఈ మార్చ్ 18 సాయంత్రం 7 గంటలకి అలా స్టార్ట్ అవ్వనుంది అట.

అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణం అంతా కూడా ఈ ఈవెంట్ లో మెరవనున్నట్టు తెలుస్తుంది. అలాగే సరికొత్త ఎలిమెంట్స్ తో మేకర్స్ అక్కడ ఆశ్చర్యపరచనున్నారని కూడా టాక్. మొత్తానికి అయితే ఈ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేసి చూపించనున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు