ఆ సీక్వెన్స్ తప్ప ఎన్టీఆర్ – చరణ్ కాంబినేషన్ సీన్స్ అన్ని.. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో నేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ – చరణ్ కలయికలో ప్రత్యర్థుల పై చేసే యాక్షన్ సీన్స్ తప్ప.. వీరి కలయికలోని మిగిలిన భాగం అంతా షూటింగ్ పూర్తయిపోయిందని తెలుస్తోంది. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ సెకెండ్ వీక్ నుండి ఈ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version