మనసు మార్చుకున్న ‘సాహో’ టీమ్ !

17th, December 2017 - 04:14:42 PM

రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ చిత్రీకరణ కొద్ది రోజుల పాటు నెమ్మదించిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా జరిపగా బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరణకు ఇంకా అనుమతులకు అందనందున యూనిట్ సమయం వృధా కాకుండా హైదరాబాద్లో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసింది.

ఇంకొద్దిరోజుల్లో ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో ప్రభాస్ తో పాటు కీలక నటీనటులంతా పాల్గినంటారని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తికాగానే సుమారు రెండున్న నెలల భారీ షెడ్యూల్ కోసం టీమ్ దుబాయ్ వెళుతుంది. అక్కడ యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.