సాయి తేజ్ హెల్త్ పై లేటెస్ట్ బులెటిన్..వివరాలు ఇవే!

Published on Sep 11, 2021 9:42 am IST

టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి ఓ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మరి ఈ వార్త బయటకి వచ్చిన వెంటనే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకి లోను కాగా ఇతర హీరోల అభిమానులు వారికి ధైర్యం చెప్పి సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతే కాకుండా మెగాస్టార్ సహా పవన్, అల్లు అరవింద్ లు వెంటనే ఆసుపత్రికి చేరుకొని సాయి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండగా విషయం తెలిసిన సినీ ప్రముఖులు సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని తెలుపుతున్నారు.

మరి నిన్న అర్ధ రాత్రే చిరు సాయి తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్ వారు పొందుపరిచిన అప్డేట్ అని అభిమానులతో పంచుకొని ధైర్యం చెప్పారు. మరి ఇప్పుడు వారి నుంచి తాజా అప్డేట్ బయటకి వచ్చింది. దీని ప్రకారం సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా కొనసాగుతుంది అని తీవ్ర స్థాయి గాయాలు కీలక ప్రాంతాల్లో తగలేకపోవడం మూలాన ఏ అవయవం కూడా దెబ్బ తినలేదు అని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్నాడని తెలియజేసారు. మిగతా మెడికల్ అప్డేట్ ని రేపు పొందుపరుస్తామని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :