“సలార్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..మళ్ళీ యాక్షన్ తోనే?

Published on Jun 4, 2022 3:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న క్రేజీ మాస్ థ్రిల్లర్ “సలార్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నీల్ బర్త్ డే కావడంతో సలార్ యూనిట్ మరియు ప్రభాస్ కూడా అతడికి బర్త్ డే విషెష్ తెలియజేసారు.

ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ జూన్ 8 నుంచి స్టార్ట్ చేయనున్నారట. అలాగే ఈ షెడ్యూల్ కూడా సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ అవ్వనుందట. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :