న్యూస్ రిపోర్టర్ గా మారబోతున్న రష్మిక !

Published on Jul 3, 2022 9:41 pm IST

సందీప్ వంగ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఒక న్యూస్ రిపోర్టర్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని.. ఆ కనెక్షన్ కి ఆమె వృత్తికి కూడా లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక – రణబీర్ కపూర్ ల పై కీలక సీన్స్ ను కూడా షూట్ చేశారు.

మొత్తానికి పుష్పతో నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు కానుంది. కాగా మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్‌’ సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :