“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 13, 2022 10:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఇది వస్తుంది.

ఏ హంగులో కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. మహేష్ అయితే ప్రస్తుతానికి రెస్ట్ లోనే ఉన్నా మహేష్ లేని సన్నివేశాలను పెట్ల తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లేటెస్ట్ షూట్ పై మరింత సమాచారం ఇపుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా ఈ టోటల్ షెడ్యూల్ ఈ జనవరి 15 నాటికి కంప్లీట్ అవ్వనుంది అని తెలుస్తుంది. ఆల్రెడీ బీచ్ ఏరియా, జగదాంబ ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జరిగిందట. మరి ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :