“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 29, 2022 8:06 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి వచ్చే మే లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడగా ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ అయ్యిపోయినట్టే అట. అక్కడక్కడా చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా టోటల్ షూటింగ్ అయితే పూర్తయ్యిపోయిందట.

అలాగే ప్రస్తుతం మూడో సాంగ్ మరియు సినిమా ప్రమోషన్స్ ని సంబంధించి ప్లానింగ్స్ లో ఉన్నారట. మరి వీటిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :