“సర్కారు వారి పాట” స్పెషల్ సాంగ్ యాడింగ్ పై లేటెస్ట్ టాక్.!

Published on May 29, 2022 1:17 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం “సర్కారు వారి పాట” ఎంత మంచి హిట్ అయ్యిందో తెలిసిందే. మహేష్ కెరీర్ లో మరో హిట్ సినిమాగా చేరిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో మంచి రన్ ని కనబరుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు గడిచాక మేకర్స్ ఇంకో స్పెషల్ సాంగ్ ని థియేట్రికల్ వెర్షన్ కి యాడ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

అయితే ఇది మొన్ననే యాడ్ చెయ్యాల్సి ఉండగా ఇది కాస్త డిలే అయ్యింది. మరి లేటెస్ట్ గా అయితే దీనిపై అప్డేట్ వినిపిస్తుంది. ఈ సాంగ్ ని మేకర్స్ ఈ మే 31 నుంచి యాడ్ నుంచి ఈ మురారి బావ సాంగ్ ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :