‘సవ్యసాచి’ షూటింగ్ అప్డేట్ !

అక్కినేని నాగ చైతన్య చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన భారీ హిస్ సెట్లో చైతన్య, నిధి అగర్వాల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

ఈ షెడ్యూల్ ఈ నెల 28 వరకు జరగనుంది. అనంతరం కొత్త షెడ్యూల్ ను జనవరి 4 నుండి మొదలుకానుంది. చందూ మొండేటి నాగచైతన్యను కొత్తగా చూపిస్తానని చెబుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.