చరణ్, శంకర్ ల భారీ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 6, 2022 2:30 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియాస్ ఐకానిక్ దర్శకుడు శంకర్ ల కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ లైనప్ లో అనౌన్స్ చేసిన మరో సాలిడ్ ప్రాజెక్ట్ ఇది. అయితే మాములుగా శంకర్ తో సినిమాలు అంటేనే చాలా గ్రాండ్ గా ఉంటాయి దానితో పాటు తన సబ్జెక్ట్ కూడా అంతే స్ట్రాంగ్ గా శంకర్ చూపిస్తారు.

అయితే ఇప్పుడు శంకర్ మళ్ళీ తన స్టార్డం కి తగ్గ హిట్ ని అయితే మళ్ళీ అందుకోలేదు. అందుకే అంతా తన సాలిడ్ కం బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూట్ పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ ఫిబ్రవరి 8 నుంచి రాజమండ్రిలో ప్లాన్ చేశారట. దాదాపు 20 రోజులు పాటు శంకర్ ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తమ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :