శివ కార్తికేయన్ “డాన్” నుండి ఇంపార్టెంట్ అప్డేట్ సిద్ధం

Published on Jan 30, 2022 8:02 pm IST


హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డాన్. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు, డైరక్టర్ ఎస్. జే సూర్య కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ మరియు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని అల్లిరజః సుబస్కరన్ మరియు శివ కార్తికేయన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ పై చిత్ర యూనిట్ రేపు క్లారిటీ ఇవ్వనుంది. రేపు ఉదయం 10:10 గంటలకు ముఖ్యమైన అప్డేట్ ను ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ అప్డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :