“స్క్విడ్ గేమ్ 2” కోసం అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవా.!

Published on Apr 6, 2022 12:00 pm IST

ఓటిటి రంగంలో ఇప్పుడు పెద్ద ఎత్తున కొరియన్ భాషకి చెందిన కంటెంట్ పాగా వేసేసింది. అది సినిమాలు అయితేనేమి వెబ్ సిరీస్ లు అయితేనేమి సాలిడ్ కంటెంట్ తో వారు ఓటిటి వీక్షకులకు అదిరే ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

అయితే ఈ కంటెంట్ ని ఆడియెన్స్ కి ఎక్కువగా అందిస్తున్న ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారే. అలా వీరి నుంచి గత ఏడాది వచ్చిన సెన్సేషనల్ గ్లోబల్ హిట్ సిరీస్ “స్క్విడ్ గేమ్ సీజన్ 1”. ఇది అయితే భాషతో సంబందం లేకుండా అన్ని దేశాల్లో కూడా హిట్ అయ్యింది.

దీనితో సీజన్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సీజన్ పై డైరెక్టర్ హ్వాన్గ్ డాంగ్ హ్యుక్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం అయితే సీజన్ 2 మరో రెండేళ్ల తర్వాత అంటే 2024 అందులోని ఆ ఏడాది చివరలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తాను తెలిపారు. అంటే అప్పుడు వరకు రెండో సీజన్ చూసే భాగ్యం ఎవరికీ లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :