ఉదయనిధి స్టాలిన్ చివరి చిత్రం పై లేటెస్ట్ అప్డేట్!

Published on Mar 12, 2023 9:05 pm IST


ప్రముఖ తమిళ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన రాబోయే రెండు చిత్రాలైన కన్నై నంబతే మరియు మామన్నన్‌లను పూర్తి చేసిన తర్వాత నటన నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. స్టాలిన్ ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే అంకితం కానున్నారు. స్టాలిన్ నటించిన కన్నై నంబతే మార్చి 17న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు జూన్‌లో మామన్నన్ థియేటర్లలోకి రానుంది.

తాజా అప్డేట్‌ ప్రకారం, మామన్నన్ డబ్బింగ్, ఎడిటింగ్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ ఈ చిత్రాన్ని 125 రోజుల పాటు చిత్రీకరించామని వెల్లడించారు. మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, మామన్నన్‌లో కీర్తి సురేష్ కథానాయిక గా నటిస్తుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టాలిన్ స్వయంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :