మహేష్ తో త్రివిక్రమ్ షూటింగ్ ప్లాన్ ?

మహేష్ తో త్రివిక్రమ్ షూటింగ్ ప్లాన్ ?

Published on Oct 4, 2021 11:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ ను నవంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుపెట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు