మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై మరో క్రేజీ రూమర్ !

Published on Dec 6, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి మొదలు అవుతుందని అందరూ భావించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఐదు నెలలు పోస్ట్ ఫోన్ అయిందని గత నాలుగు రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి మరో అప్ డేట్ వినిపిస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారట. పైగా మొదట ఓ సాంగ్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. ఈ సాంగ్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే దసరాకి స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్.

అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :