మహేష్, త్రివిక్రమ్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

మహేష్, త్రివిక్రమ్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 31, 2022 1:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ ను మార్చి సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఓ ఫైట్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. ఈ ఫైట్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచనలో ఉన్నారు. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు