నవంబర్ నుంచి మహేష్ తో త్రివిక్రమ్ !

Published on Sep 21, 2021 7:40 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ ను నవంబర్ నుంచి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీయబోతున్నారు. ఈ ఫైట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయబోతున్నారు.

ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం :