సాంగ్ తో స్టార్ట్ చేయబోతున్న మహేష్?

సాంగ్ తో స్టార్ట్ చేయబోతున్న మహేష్?

Published on Feb 28, 2022 10:15 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఓ సాంగ్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్న ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేక సెట్ ను కూడా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యాక.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ లో ఫైట్ సీక్వెన్స్ షూట్ స్టార్ట్ కానుంది.

ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు