‘వీర భద్రుడు’ షోస్ ఎప్పటి నుంచి? లేటెస్ట్ అప్డేట్!

VeeraBhadrudu

స్టార్ నటుడు సూర్య నటించిన అవైటెడ్ మాస్ చిత్రం వీర భద్రుడు ఇపుడు విడుదలకి రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ చిత్రం తమిళ్ లో కరుప్పు గా రాబోతుంది. అయితే ఈ మే 14న గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అనూహ్యంగా చాలా సినిమాలకి జరిగినట్టే ఈ సినిమా విడుదల కూడా ఆగిపోయింది.

కంటెంట్ వచ్చినా కే డి ఎం థియేటర్స్ కి అందకపోవడంతో ఉదయం, మధ్యాహ్నం షోస్ కూడా క్యాన్సిల్ అయ్యిపోయాయి. ఇక మరి సినిమా ఇవాళ ఉంటుందా లేదా అనే దానికి ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మరో మూడు గంటల్లో అలా అన్ని సమస్యలు సర్దుబాటు అవుతాయని తెలుస్తుంది.

పైగా సూర్య పర్శనల్ గా ఈ సమస్యలో కలుగజేసుకొని పరిష్కారం చూపించనున్నట్టు టాక్. సో దీనితో వీర భద్రుడు, అటు కరుప్పు షోలు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సాయంత్రం నుంచి మొదలు కానున్నాయని సినీ వర్గాల్లో టాక్. మరి ఈ సినిమా విషయంలో సస్పెన్స్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

Exit mobile version