సూర్య “ఈటీ” రిలీజ్‌పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Feb 1, 2022 3:00 am IST

సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈటీ (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). సన్ పిక్చర్స్ పతాకంపై పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్‌ని ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :