భారీ ధరకు ఈ పాన్ ఇండియా మూవీ తమిళ్ థియేట్రికల్ రైట్స్!

Published on Mar 8, 2023 12:32 pm IST

శాండల్‌వుడ్ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో కబ్జా అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ ధరకు పాన్ ఇండియన్ సినిమా థియేట్రికల్ హక్కులను (తమిళనాడు ప్రాంతానికి మాత్రమే) సొంతం చేసుకుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శ్రియ శరణ్ కథానాయికగా నటించింది. దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, మురళీ శర్మ, సుధ, మరియు కబీర్ దుహన్ సింగ్ ఈ బిగ్గీలో భాగమయ్యారు, ఇది మార్చి 17, 2023న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :