లేటెస్ట్ : తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల

Published on Jan 30, 2023 8:39 pm IST

నందమూరి తారకరత్న ఇటీవల నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కుప్పంలో ఒక్కసారిగా అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు డాక్టర్లు. అయితే ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం నందమూరి బాలకృష్ణ ఆయనని బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా తారకరత్నకు అక్కడి నిపుణులైన పలువురు డాక్టర్లు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కొద్దిసేపటి క్రితం తారకరత్న కి సంబంధించి లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ని హాస్పిటల్ వారు విడుదల చేసారు. ప్రస్తుతం ఇంకా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, అయితే ఆయనకి ఎక్మొ మాత్రం పెట్టలేదని అన్నారు. అలానే వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్సని అందిస్తున్నాం అని, మరికొంత సమయం గడచిన తరువాతనే పూర్తి విషయాలు వెల్లడించగలము అంటూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వారు తమ తాజా ప్రెస్ నోట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం :