తారక రత్న హెల్త్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 12, 2023 2:00 pm IST

గత కొన్ని రోజులు కితం నందమూరి వారి హీరో నందమూరి తారక రత్న అప్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టినటువంటి పాద యాత్రలో పాల్గొన్న సమయంలో అభిమానుల భారీ ఎత్తున తాకిడి మూలాన అనుకోని రీతిలో తాను తీవ్ర గుండెపోటుకు లోనయిన సంగతి తెలిసిందే. దీనితో వెంటనే ఆసుపత్రికి తరలించడం అక్కడ నుంచి బెంగళూరు కి షిఫ్ట్ చేయడం జరిగింది.

దీనితో తారక రత్న హెల్త్ పై వైద్యులు తీవ్రంగా శ్రమిస్తూ తనకి ఇప్పటివరకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు తారక రత్న ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. దీని ప్రకారం తారక రత్న కోసం ప్రస్తుతం విదేశీ వైద్యులని రప్పించి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారట. ప్రస్తుతం వారు తారక రత్నకి గుండె సహా నాడీ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్టుగా తారక రత్న కుటుంబీకులు రామకృష్ణ వెల్లడి చేశారు.

సంబంధిత సమాచారం :