అజిత్ 59 ఎప్పుడు ప్రారంభం కానుందంటే !

Ajit3

తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించనున్న 59వ చిత్రం యొక్క షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ‘ఖాకి’ దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించనుండగా ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు.

ఇక అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది. అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version