లేటెస్ట్..టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు అప్డేట్.!

Published on Feb 19, 2023 1:29 pm IST

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో అనేక మార్పులు నిర్మాతలు మండలి ల మధ్య పలు కీలక అంశాలకి సంబంధించి భిన్నాభిప్రాయాలు చాలానే లేవనెత్తాయి. దీనితో ఫిలిం ఛాంబర్ లో టాలీవుడ్ నిర్మాతల మండలి కొత్త ప్యానల్ కోసం గాను ఈరోజు ఎన్నికలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఈరోజు ఉదయం మొదలైన ఎన్నికలపై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.

మరి ఈ మండలి లో మొత్తం 1200 మంది సభ్యులు ఉండగా ఇప్పటివరకు 600 వందలకి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. కాగా ఈ మధ్యాహ్నం 2 గంటలకి అయితే పోలింగ్ సమయం పూర్తి కానుంది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి కౌంటింగ్ మొదలయి రిజల్ట్ రానున్నాయి. మరి ఈ ఎన్నికల్లో అయితే ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్, తదితరులు హాజరయ్యారు.

సంబంధిత సమాచారం :