ఈ వారం సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on Sep 13, 2021 8:05 pm IST

జూన్‌ చివరి వారం నుండి థియేటర్లు తెరుచుకోవడంతో అప్పటి నుంచి ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం. సందీప్‌ కిషన్‌ హీరోగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది.

అలాగే విజయ్‌ ఆంటోని హీరోగా ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఈ చిత్రం కూడా సెప్టెంబరు 17న థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది. మరో సినిమా ‘ఫ్రెండ్‌షిప్’. క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, నటుడు అర్జున్‌ కలిసి నటించిన ఈ సినిమా సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. విజయ్‌ రాజా, రాశీ సింగ్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న సినిమా ‘జెమ్‌’. శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రధారిగా వస్తోన్న సినిమా ‘ప్లాన్‌ బి’. ‘హనీ ట్రాప్‌’ అంటూ వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం :