ఈ వారం సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on Sep 6, 2021 11:00 am IST


కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో జూన్‌ చివరి వారం నుండి థియేటర్లు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం కూడా వినాయకచవితిని పురస్కరించుకుని మరికొన్ని చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.

గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న ‘సిటీమార్’ సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 10న తమిళ/తెలుగు భాషల్లో గ్రాండ్ గా థియేటర్‌లో రిలీజ్ అవుతుంది.

విజయ్‌ సేతుపతి తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :