“ఉస్తాద్ భగత్ సింగ్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 6, 2023 1:58 pm IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఇప్పటికి కొంతమేర షూటింగ్ మాత్రమే జరిగినప్పటికీ ఫస్ట్ గ్లింప్స్ తో అయితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఇపుడు పవన్ నుంచి మరోపక్క తన పొలిటికల్ టూర్ కూడా ప్లాన్ చేయగా ఈ లోపు అయితే పవన్ మొదట “ఓజి” షూట్ స్టార్ట్ చేయనుండగా మరి “ఉస్తాద్ భగత్ సింగ్” పరిస్థితి ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఆల్రెడీ ఉస్తాద్ పై ఓ భారీ సెట్ వర్క్ జరుగుతూ ఉండగా ఈ సినిమా షూట్ పవన్ టూర్ గ్యాప్ లో స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ జూన్ నెల ఆఖరులో 26 నుంచి అలా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో రీస్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇలా అయితే పవన్ తన సినిమాలు షూటింగ్ లలో పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం :