‘వాల్తేరు వీరయ్య’ విడుదలయ్యేది అప్పుడేనా ?

Published on Oct 4, 2022 12:19 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాలో ఈ ఇద్దరు బ్రదర్స్ గా నటించబోతున్నారు. అందుకే ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమా రిలీజ్ అప్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రవితేజ, ఈ చిత్రంలో మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు అట. మెగాస్టార్ – రవితేజ.. రెండు క్యారెక్టర్ల మధ్య ఫుల్ ఎమోషనల్ డ్రామా ఉంటుందని తెలుస్తోంది. పైగా చిరంజీవితో పాటు ఈ చిత్రంలో రవితేజ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. అన్నట్టు ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది.

సంబంధిత సమాచారం :