“వారిసు” నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే.?

“వారిసు” నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే.?

Published on Dec 10, 2022 12:00 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా మరి ఆల్రెడీ ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా బయటకి రాగా ఇవి మంచి హిట్ గా కూడా నిలిచాయి. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది.

మరి ఈ సాంగ్ ని మేకర్స్ ఈ డిసెంబర్ 24 లోపు రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు అయితే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 12న అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే తెలుగులో ఈ చిత్రంని “వారసుడు” పేరిట రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు