‘అఖండ’ ను బీట్ చేయబోతున్న ‘వీర సింహారెడ్డి’ !

‘అఖండ’ ను బీట్ చేయబోతున్న ‘వీర సింహారెడ్డి’ !

Published on Dec 18, 2022 7:04 PM IST


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న ‘వీర సింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. కాగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని కూడా థమన్ పూర్తి చేశాడు. అఖండ నేపథ్య సంగీతం ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీర సింహారెడ్డి నేపథ్య సంగీతం అంతకు మించి ఉంటుందట. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

కాగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నారు. పైగా శ్రుతిహాసన్ తన కెరీర్‌లో బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి. మరి ఈ జోడి స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు