‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రస్తుతం మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. నితిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఫ్లాష్ బ్యాక్ చాలా ఫన్నీగా ఉంటుందని.. గత అనుభవాల రీత్యా ప్రేమ పై భయాన్ని పెంచుకున్న హీరో.. ఆ భయాన్ని కనబడకుండా దాచడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది.
మొత్తానికి మరో కొత్త కథతో నితిన్ – వెంకీ కుడుముల ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ కుడుముల తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తి ఏర్పడింది. మొత్తానికి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా వచ్చేలా ఉంది.