యాక్షన్ సీక్వెన్స్‌తో షురూ కానున్న విజయ్ “ఖుషీ” నెక్స్ట్ షెడ్యూల్!

Published on Mar 5, 2023 5:00 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషీ. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గీ త్వరలో షూటింగ్‌ను పునః ప్రారంభించనుంది. ఈ రోజు, దర్శకుడు శివ, విజయ్ దేవరకొండ మరియు ఇతరులతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌తో ఖుషీ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాజా నివేదికల ప్రకారం, తాజా షెడ్యూల్ మార్చి 8, 2023 నుండి ప్రారంభమవుతుంది. మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :