‘ఆచారి అమెరికా యాత్ర’ లేటెస్ట్ అప్డేట్ !
Published on Oct 16, 2017 6:36 pm IST

మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నా ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది, గతంలోనే ఈ షెడ్యూల్ పూర్తవ్వాల్సి ఉంది, కాని విష్ణు షూటింగ్ సమయంలో గాయ పడ్డంతో కొంత గ్యాప్ తరువాత ఫారిన్ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది.

గతంలో జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలు మంచి విజయం సాదించాయి. అదే తరహాలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఆచారి అమెరిక యాత్ర సినిమాలో విష్ణు కు జోడిగా ప్రగ్య జైస్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు.

 
Like us on Facebook